Tamil Nadu: ప్రైవేట్ కాలేజీలో గుండు గీయించి విద్యార్థిని ర్యాగింగ్
కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ టెక్నికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు గుండు గీయించి ర్యాగింగ్ చేశారు.
- Author : Praveen Aluthuru
Date : 09-11-2023 - 9:44 IST
Published By : Hashtagu Telugu Desk
Tamil Nadu: కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ టెక్నికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థికి అదే కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు గుండు గీయించి ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్‌కు గురైన విద్యార్థి బీలమేడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ర్యాగింగ్‌కు పాల్పడిన 7 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మద్యం తాగి డబ్బులు డిమాండ్ చేస్తూ జూనియర్ విద్యార్థిపై దాడి చేసి, గుండు కొట్టించి, ర్యాగింగ్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. కోయంబత్తూరులో మొదటి సంవత్సరం విద్యార్థిపై ర్యాగింగ్, దాడి ఘటన సంచలనం సృష్టించింది. అరెస్టయిన ఏడుగురు విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేస్తూ కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.
సీనియర్లు డబ్బులు అడిగితే లేవని చెప్పడంతో దాడి చేశారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి 11.30 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు 5 గంటల పాటు తమను బయటకు రానివ్వకుండా కొట్టి, చిత్రహింసలకు గురిచేశారని బాధిత విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం