Parliament Winter session: పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధం
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.
- By Praveen Aluthuru Published Date - 07:25 PM, Thu - 9 November 23
Parliament Winter session:పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 4 నుంచి శీతాకాల సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 22 వరకు సెలవులు మినహా 15 రోజుల పాటు ఉభయ సభలు జరుగుతాయనిపేర్కొన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత-2023 , భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత), భారతీయ సాక్ష్యా బిల్లు-2023 (భారతీయ సాక్ష్యం బిల్లు) జరిగిన సంగతి తెలిసిందే. తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపారు. దీనికి సంబంధించిన నివేదికలు తాజాగా హోం మంత్రిత్వ శాఖకు అందాయి. తాజా సమావేశాల్లో వీటిపై చర్చించే అవకాశం ఉంది. ఐపీసీ, సీఆర్‌పీసీ, సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కేంద్రం ఈ బిల్లులను తీసుకొచ్చింది. ఇవి కాకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ నియామకాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. శీతాకాల సమావేశాల్లో వీటిపై స్పష్టత రానుంది.
Also Read: 17 Crore Injection: ఒక్క ఇంజక్షన్ డోస్ ఖరీదు రూ.17 కోట్లు