Pregnant Woman Raped: గర్భిణిపై సామూహిక అత్యాచారం, దహనం
మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
- By Praveen Aluthuru Published Date - 02:28 PM, Sat - 17 February 24
Pregnant Woman Raped: మధ్యప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. తాజాగా ముగ్గురు దుండగులు కలిసి ఓ మహిళను సామూహిక అత్యాచారం చేశారు. బాధాకర విషయం ఏంటంటే ఆమె ప్రస్తుతం గర్భిణీ.
మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. గర్భిణీ అని చూడకుండా దారుణంగా హత్యాచారం చేసి ఆపై నిప్పటించిన ఘటన సమాజాన్ని నిలదీస్తుంది. మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లాలో 34 ఏళ్ల గర్భిణిపై ముగ్గురు క్రూరులు అత్యాచారం చేసి, నిప్పంటించారని, ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నదని పోలీసులు తెలిపారు. 80 శాతం కాలిన గాయాలైన బాధితురాలు గ్వాలియర్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
అంబాహ్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చాంద్ కా పురా గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత మహిళపై ఇంధనం పోసి నిప్పంటించారు. బాధితురాలు మేజిస్ట్రేట్ వద్ద తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది. ఈ దారుణ ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.