Prashanth Neel: ఎన్టీఆర్ మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్
ప్రశాంత్ నీల్...కన్నడ కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు.
- By Hashtag U Published Date - 11:58 AM, Mon - 11 April 22

ప్రశాంత్ నీల్…కన్నడ కేజీఎఫ్ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ దర్శకుడు. త్వరలోనే టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో ఓ మూవీ చేయనున్నట్లు సమాచారం. దీనిపై ప్రశాంత్ నీల్ స్పందించారు. గత రెండు సంవత్సరాలుగా ఎన్టీఆర్ తో తనకు చాలా సాన్నిహిత్యం ఉన్నట్లు చెప్పారు. గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన తాను ఇప్పుడు ఆయనతో ఓ ప్రాజెక్ట్ కోసం కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. అయితే తన ప్రాజెక్టు సంబంధించిన స్క్రిప్టు ఎన్టీఆర్ కు బాగా నచ్చిందని తెలిపారు. అయితే ఆయనతో చేయబోయే మూవీ ఏ జానర్ అని మాత్రం అడగొద్దంటూ అందర్నీ సస్పెన్స్ లోకి నెట్టారు. ఇప్పటికే స్క్రిప్టు విషయంలో ఎన్టీఆర్ ను పలు పర్యాయాలు కలిసానని వివరించారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్-2 ప్రమోషన్ కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. అటు ఎన్టీఆర్ సైతం త్వరలోనే కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే మూవీ ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది.