Radheshyam: రిలీజ్ కు ముందే నిర్మాతలకు భారీ లాభాలు… ‘రాధేశ్యామ్’ తో ‘ప్రభాస్’ రికార్డ్..!!
పాన్ ఇండియా స్టార్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలుసు.
- By Hashtag U Published Date - 10:11 AM, Sat - 5 February 22

పాన్ ఇండియా స్టార్ నటించిన ‘రాధేశ్యామ్’ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో మనకు తెలుసు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ‘రాధేశ్యామ్’ ఎట్టకేలకు మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. అయితే, విడుదలకు ముందే ఈ సినిమా నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతేకాదు ఇదిరా మా డార్లింగ్ ప్రభాస్ స్టామినా అని కూడా ఆయన ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారట. సాధారణంగా అయితే విడుదల తేదీ ప్రకటించాక ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది.
ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన మూవీ ‘రాధేశ్యామ్’రిలీజ్‌కు ఇంకా నెలపైనే సమయం ఉంది. కాగా, ఇటీవల ‘రాధేశ్యామ్’ చిత్రాని మార్చ్ 11న విడుదల చేస్తామని మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో… భారీ స్థాయిలో థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట. ఇప్పటికే రూ.400 కోట్ల వరకు బిజినెస్ అయిందని టాక్ వినిపిస్తోంది. అంటే… విడుదలకు ముందే నిర్మాతలకు రూ. 150 కోట్ల వరకు లాభాలు వచ్చినట్టు అర్థమవుతోంది. ఇది
ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ వార్త విని పండుగ చేసుకుంటున్నారు. రిలీజ్ కు ముందే ఇలా ఉంటే… ‘రాధేశ్యామ్’ విడుదలైన తర్వాత ఏ రేంజ్‌లో లాభాలను తెచ్చిపెడుతుందో అని చెప్పుకుంటున్నారు. మరి ‘రాధేశ్యామ్’ తో ప్రభాస్ ఏ రేంజ్ లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తాడో అన్నది వేచి చూడాలి.
Related News

Salaar Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే..!
సలార్ మూవీ ని రానున్న డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు (Salaar Release Date) మేకర్స్ సిద్ధం అయినట్లు సోషల్ మీడియాలో సమాచారం అందుతుంది.