Sarath Kumar : నటుడు శరత్‌కుమార్ ఆరోగ్యంపై పీఆర్ టీం క్లారిటీ..
- Author : Vamsi Chowdary Korata
Date : 12-12-2022 - 2:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ సినీనటుడు శరత్‌కుమార్ (Sarath Kumar) తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. డయేరియా, డీహైడ్రేషన్‌తో శరత్‌కుమార్‌ను (Sarath Kumar) చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారని వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. సోషల్ మీడియాలోనూ (Social Media) శరత్‌కుమార్ (Sarath Kumar) ఆరోగ్యంపై వదంతులు పుట్టుకొచ్చాయి. తాజాగా ఈ వార్తలపై శరత్‌కుమార్ (Sarath Kumar) పీఆర్ టీం (PR Team) స్పందించింది. చిన్నపాటి వైద్య పరీక్షల నిమిత్తం ఆయన ఆసుపత్రికి వెళ్లారని, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఇంటికి చేరుకున్నారని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని పీఆర్ టీం తెలిపింది.
Also Read: Google Chrome : క్రోమ్ లో కొత్త ఫీచర్..తెలిస్తే షాక్ అవుతారు..