Posani : ముగిసిన పోసాని కృష్ణమురళి విచారణ
Posani : విచారణ సందర్భంగా పోసాని అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం
- Author : Sudheer
Date : 27-02-2025 - 10:41 IST
Published By : Hashtagu Telugu Desk
సినీనటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani )పోలీసుల విచారణ (Police Investigation) ముగిసింది. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఆయనను 9 గంటలపాటు సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ విచారణను జిల్లా ఎస్పీ విద్యాసాగర్, సీఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు. విచారణ సందర్భంగా పోసాని అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. అయితే, కొన్ని కీలక అంశాలపై స్పష్టమైన సమాచారం రాబట్టేందుకు పోలీసులు మరింత గడువు కోరతారని విశ్లేషకులు భావిస్తున్నారు.
Posani Arrest : బాబు, లోకేశ్, పవన్ బూతులు తిట్టలేదా ? – అంబటి
పోసానిపై నమోదైన కేసుల పరంగా పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు. ఆయన చేసిన వ్యాఖ్యలు, వాటి ప్రభావం, సామాజిక విరోధాలకు దారి తీసే అవకాశముందా? అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ విచారణలో పోలీసులకు అవసరమైన ఆధారాలు లభించాయా? లేదా? అన్నదానిపై అధికారిక ప్రకటన రాలేదు. అయితే, కేసు నడుస్తున్న తీరును బట్టి, ఇంకా మరికొన్ని విచారణలు జరగొచ్చని తెలుస్తోంది.
Mahesh Leaked Look: ఎస్ఎస్ రాజమౌళి మూవీలో మహేష్ లుక్ ఇదేనా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!
విచారణ అనంతరం పోసాని కృష్ణమురళిని రైల్వేకోడూరు కోర్టులో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచబోతున్నారు. అక్కడ న్యాయపరమైన ప్రక్రియల అనంతరం ఆయనకు బెయిల్ మంజూరు అవుతుందా? లేక మరింత విచారణ అవసరమా? అనే అంశంపై స్పష్టత రానుంది. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది.