Tension in Tadipatri : మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
Tension in Tadipatri : కట్లగూడూరు గ్రామంలో పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని తర్వాత అతన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Former MLA Kethireddy )ని పోలీసులు అడ్డుకున్నారు
- Author : Sudheer
Date : 29-04-2025 - 7:43 IST
Published By : Hashtagu Telugu Desk
అనంతపురం జిల్లా తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. కట్లగూడూరు గ్రామంలో పార్టీ కార్యకర్తపై జరిగిన దాడిని తర్వాత అతన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి(Former MLA Kethireddy )ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసులు శాంతిభద్రతల సమస్య ఉందని మాజీ ఎమ్మెల్యేను ఆపారు. అయితే పోలీసుల తీరుఫై కేతిరెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
King And Queen: రాజు పైలట్.. రాణి కోపైలట్.. విమానంలో సాహస యాత్ర
పెద్దారెడ్డి అనుచరుల హింసకు గురైన కార్యకర్తను పరామర్శించేందుకు వస్తే అడ్డుకోవడం తగదని ఆయన అన్నారు. దీంతో పోలీసులతో ఆయన మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రజా ప్రతినిధిగా బాధితుల్ని పరామర్శించే హక్కు తనకు ఉందని స్పష్టం చేశారు. అయితే పరిస్థితి అదుపు తప్పవచ్చన్న నిఘా సంస్థల సూచనల మేరకు కేతిరెడ్డి ముందుకెళ్లకూడదని పోలీసులు తెలిపారు.
వివాదం కొనసాగుతున్నప్పటికీ శాంతిని కాపాడాల్సిన అవసరం ఉన్నందున, తట్రాళ్లపల్లి వద్ద కేతిరెడ్డి వెనుదిరిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇది ప్రజాస్వామ్యంపై దాడి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజల్ని కలవడాన్ని అడ్డుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనతో తాడిపత్రి నియోజకవర్గంలో రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.