HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Police Case File On Naga Susheela

Tollywood : వివాదంలో హీరో నాగార్జున ఫ్యామిలీ..

శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారట. దర్శపీఠ నిర్వాహకులు శ్రీనివాసరావుపై వీరు దాడి చేశారని ఆరోపిస్తూ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Author : Sudheer Date : 18-09-2023 - 1:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Case File on Naga Susheela
Police Case File on Naga Susheela

వివాదాలకు చాల దూరంగా ఉండే అక్కినేని నాగార్జున ఫ్యామిలీ (Akkineni Nagarjuna Family)..తాజాగా వివాదంలో నిలిచింది. చిత్రసీమలో యువసామ్రాట్ గా , కింగ్ గా , మన్మధుడి గా ఇలా అనేక విధాలుగా పిలువబడే నాగార్జున (Akkineni Nagarjuna)..ప్రస్తుతం హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. కేవలం నాగార్జున మాత్రమేకాదు..ఆయన కొడుకులు నాగ చైతన్య , అఖిల్ లు సైతం హిట్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఒక్క హిట్ అయినా కొట్టండి బాబు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. నిన్న మొన్న వచ్చిన హీరోలు పాన్ ఇండియా హిట్లు కొడుతుంటే..ఎంతో బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాగ్ ఫ్యామిలీ హీరోలు మాత్రం పాన్ హిట్ కాదు కదా..మాములు బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఇంతవరకు కొట్టలేదు.

ఇదిలా ఉంటె తాజాగా నాగ్ ఫ్యామిలీ వివాదంలో చిక్కుకుంది. నాగార్జున సోదరి నాగసుశీల (Nagarjuna Sister Naga Susheela)పై పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీజ ప్రకృతి దర్శపీఠం ఆశ్రయంపై ఈ నెల 12న నాగసుశీల, ఆమె అనుచరులు దాడికి పాల్పడ్డారట. దర్శపీఠ నిర్వాహకులు శ్రీనివాసరావు (Srinivasrao)పై వీరు దాడి చేశారని ఆరోపిస్తూ మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నాగ సుశీలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టారు.

గతంలో నాగసుశీల తన వ్యాపార భాగస్వామిపై క్రిమినల్ కేసు పెట్టారు. తమకు తెలియకుండా తమ భూమిని విక్రయించారని ఆరోపిస్తూ నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుపై హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నాగసుశీల ఫిర్యాదు చేసి వార్తల్లో నిలిచారు. తన భూమిని విక్రయించి నగదు దుర్వినియోగం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also : AP BJP : స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ల‌కు సీఐడీ వెళ్లిందా..? : ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వ‌రి

నాగసుశీల, శ్రీనివాసరావు చాలా ఏళ్లుగా వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరూ కలసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడంతో పాటు సినిమాలు కూడా నిర్మించారు. సుశాంత్‌ను హీరోగా పెట్టి నాగసుశీల, శ్రీనివాసరావు కలసి శ్రీనాగ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మూడు సినిమాలు నిర్మించారు. వాటిలో ‘కరెంట్’ సినిమా ఫర్వాలేదనిపించినా.. ఆ తరవాత వచ్చిన ‘అడ్డా’ ,‘ఆటాడుకుందాం రా’ సినిమాలు ప్లాప్ అయ్యి భారీ నష్టాలూ తెచ్చిపెట్టాయి. అప్పటికే భూమి విషయంలో వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థలు ఈ సినిమాల పరాజయాలతో మరింత ఎక్కువైనట్లు సమాచారం. ,‘ఆటాడుకుందాం రా’ సినిమా కోసం శ్రీనివాసరావు రూ.5 కోట్లు సమకూర్చినట్లు తెలుస్తోంది. అయితే సినిమా పరాజయంతో నష్టం రావడంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలోనే తనపై తప్పుడు కేసులు పెట్టారని శ్రీనివాసరావు ఆరోపించిన్నట్లు సమాచారం. మొత్తం మీద వివాదాస్పద వార్తల్లో నాగ సుశీల పేరు ఇప్పుడు వైరల్ గా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Akkineni Naga Susheela
  • nagarjuna sister
  • police case
  • Srinivasrao
  • tollywood

Related News

Faria Abdullah's Shocking Comments on Marriage

Faria Abdullah: పెళ్లిపై ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్

జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా తాజాగా పెళ్లి, ప్రేమపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె దృష్టిలో ప్రేమ ఒక అద్భుతమైన అనుభూతి అని, కానీ పెళ్లి అనేది వ్యక్తిని మార్చే ప్రక్రియ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరం పెళ్లిపై ఆసక్తి కోల్పోతోందని, భవిష్యత్తులో ఈ వ్యవస్థ అర్థమే మారిపోవచ్చని ఆమె సంచలన విశ్లేషణ చేశారు. ఒకవేళ తాను నటి కాకపోయి ఉంటే షెఫ్ లేదా ఈవె

  • Legendary producer R. B. Choudary has passed away

    Rb Choudary: టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. ప్రముఖ సూపర్‌గుడ్‌ నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం

  • Fauji Movie

    Fauzi: ప్రభాస్ ఫౌజీ షూటింగ్‌లో.. ఒకరు మృతి.. ఐదుగురికి తీవ్ర గాయాలు

Latest News

  • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

  • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

  • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

  • Pm Modi: బంగారం కొనడం ఆపేయండి.. ప్రధాని మోదీ విజ్ఞప్తి…

  • Tamil Politics: విజయ్ ప్రమాణ స్వీకారంలో వివాదం ?

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd