Fact Check : సోమాలియా నుంచి విషపూరిత అరటిపళ్లు దిగుమతి?
అరటిపండు నుంచి పురుగులు బయటికొస్తున్న వీడియో ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. సోమాలియా నుంచి దిగుమతి చేశారంటూ ఎంతోమంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు.
- Author : Hashtag U
Date : 11-11-2021 - 2:51 IST
Published By : Hashtagu Telugu Desk
అరటిపండు నుంచి పురుగులు బయటికొస్తున్న వీడియో ఒకటి ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయింది. సోమాలియా నుంచి దిగుమతి చేశారంటూ ఎంతోమంది ఆ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆ ఆరటిపళ్లలో హెలికోబాక్టర్ అనే విషపురుగు ఉందని.. తింటే 12 గంటల్లో చనిపోతామని రాస్తున్నారు.
వీడియోతో వైరల్ అవుతున్నది ఈ మెసేజే.
ఈ మధ్యనే 500 టన్నుల అరటిపళ్లు సొమాలియా నుంచి దిగుమతి అయ్యాయి. అందులో హెలికోబ్యాటర్ అనే విషపురుగు ఉంది. అది తింటే 12 గంటల్లో డయేరియా, వాంతులు, విరేచనాలు అయి బ్రెయిన్ డెడ్ అవుతుంది. అందుకే కొంతకాలం పాటు ఎవరూ అరటిపళ్లు కొనకండి. ఒకవేళ కొన్నా తినేముందు ఇలా ఓపెన్ చేసి చూడండి.
ఈ వీడియోలో, స్టేట్‌మెంట్‌లో నిజం లేదని మా పరిశోధనలో తేలింది. ఎందుకంటే సోమాలియా నుంచి మనం అరటిపళ్లు దిగుమతిచేసుకోం. మరోవైపు హెలికోబాక్టర్ అనేది పురుగు కాదు. కంటికి కనిపించని బ్యాక్టీరియా మాత్రమే!