Modi: దావోస్ సదస్సులో నేడు మోడీ ప్రసంగం
సోమవారం జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) దావోస్ ఎజెండా వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
- By Hashtag U Published Date - 09:54 AM, Mon - 17 January 22

సోమవారం జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) దావోస్ ఎజెండా వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు. ఈ సదస్సును డబ్ల్యూఇఎఫ్ తన వెబ్‌సైట్‌లోనూ, సోషల్ మీడియా ఖాతాల్లోను నిర్వహించనుంది.
కరోనా నేపధ్యంలో ఈ సదస్సు వర్చువల్‌గా నిర్వహించడం ఇది వరసగా రెండో ఏడాది. కాగా, ‘దావోస్ ఎజెండా 2022’ అనేది 2022లో ప్రపంచ నేతలు తమ వ్యూహాలను వెల్లడించడానికి తొలి వేదిక అని ఫోరం తెలిపింది. ప్రపంచ స్థితి అనే ధీమ్‌తో ఈ వేడుక ప్రారంభమవుతుంది. వివిధ దేశాల అధినేతలు, సిఇఓలు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.