Modi: కార్మికులకు 100 జతల జూట్ చెప్పులు!
- By Balu J Published Date - 12:40 PM, Tue - 11 January 22

కాశీ విశ్వనాథ్ ధామ్ వద్ద పని చేస్తున్న కార్మికులకు ప్రధాని నరేంద్ర మోదీ 100జతల జూట్ చెప్పులను అందజేశారు. ఇటీవల కాశీ వచ్చిన ఆయన ఆలయ పరిసరాల్లో కార్మికులు చెప్పులు లేకుండా తిరగడం గమనించారు. రబ్బర్, లెదర్‌తో చేసిన చెప్పులు ఇక్కడ నిషిద్ధం. ఇది శీతాకాలం సైతం కావడంతో పాదాలకు రక్షణ నిమిత్తం అక్కడి సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి 100 జతల జనపనార చెప్పులను పంపించారు. కాశీని సర్వాంగత సుందరంగా తీర్చిదిద్దుతానని, అక్కడి ప్రజల ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపరుస్తానని గత పర్యటనలో మోడీ చెప్పిన విషయం విధితమే.