Mann Ki Baat: 100వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో ప్రధాని ప్రసంగం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మన్ కీ బాత్‌లో పాల్గొన్నారు.
- By Praveen Aluthuru Published Date - 01:33 PM, Sun - 30 April 23

Mann Ki Baat: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌లో ప్రసంగించారు. దేశంలోని నలుమూలల నుంచి ప్రజలు మన్ కీ బాత్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రజా ఉద్యమంగా మారిందని అన్నారు. అక్టోబర్ 3, 2014 విజయ దశమి పండుగ రోజున ‘మన్ కీ బాత్’ యాత్రను ప్రారంభించాము. విజయ దశమి అంటే చెడుపై మంచి విజయం సాధించిన పండుగ, ‘మన్ కీ బాత్’ కూడా దేశ ప్రజల మంచితనానికి సంబంధించిన ప్రత్యేకమైన పండుగగా మారిందన్నారు మోడీ. ‘మన్ కీ బాత్’కు ప్రజా ఉద్యమంగా మారిందని, మీరు దానిని ప్రజా ఉద్యమంగా మార్చారని అన్నారు. నేను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో ‘మన్ కీ బాత్’ని పంచుకున్నప్పుడు అది ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైందని గుర్తు చేశారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాధారణ ప్రజలను కలవడం మరియు సంభాషించడం సహజం, కానీ 2014లో ప్రధాని అయిన తర్వాత జీవితం చాలా భిన్నంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యులకు చాలా దగ్గర అయ్యాను అని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు.
Read More: Badrinath Highway: చార్ ధామ్ యాత్ర భక్తులకు అలర్ట్.. బద్రీనాథ్ హైవే మూసివేత