Pm Kisan Yojana : ఇవాళే కోట్లాది మంది రైతులకు దీపావళి కానుక..ఖాతాలో రూ.2వేలు జమ చేయనున్న మోదీ.!!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త.
- By hashtagu Published Date - 08:37 AM, Mon - 17 October 22

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన 12వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు దీపావళి కానుక అందించబోతున్నారు. అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు రూ. 2వేలు బదిలీ చేయనున్నారు. 12 వ విడతగా రూ 16వేల కోట్లను విడుదల చేయనున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ యోజన 11వ విడతను మే 31, 2022న మోదీ విడుదల చేశారు. 11వ విడతగా 21,000రూపాయలను రిలీజ్ చేశారు.