PJR Flyover : నేటి నుండి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
PJR Flyover : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారభించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద అనేక సంవత్సరాలుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో
- By Sudheer Published Date - 08:07 AM, Sat - 28 June 25

హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ నుండి ఉపశమనం కలిగించే దిశగా మరో కీలక అడుగు పడింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుండి కొండాపూర్ వరకు ప్రయాణించే వాహనదారులకు సౌకర్యం కల్పించేందుకు పీజేఆర్ ఫ్లైఓవర్ (PJR Flyover) నేడు (జూన్ 28) ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారభించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద అనేక సంవత్సరాలుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో, ఈ ఫ్లైఓవర్ ద్వారా ప్రయాణ సమయం తగ్గి, ప్రయాణ అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది. ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రయాణికులకు ఇది పెద్ద వరం.
నిర్మాణ విశేషాలు – అత్యాధునిక మల్టీ లెవెల్ ఫ్లైఓవర్
ఈ ఫ్లైఓవర్‌ను SRDP (Strategic Road Development Plan) కింద రూ.182.72 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని పొడవు 1.2 కిలోమీటర్లు, వెడల్పు 24 మీటర్లు, ఆరు లైన్లతో నిర్మించబడింది. ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఇప్పటికే ఉన్న రెండు ఫ్లైఓవర్లపై మూడవ స్థాయిలో నిర్మించబడింది. క్రింద గచ్చిబౌలి ఫ్లైఓవర్, దాని పైన శిల్పా లేఅవుట్ ఫేజ్ 1 ఫ్లైఓవర్, ఇప్పుడు అందుని పైన ఫేజ్ 2 ఫ్లైఓవర్ నిర్మించబడింది. ఈ నిర్మాణం హైదరాబాద్ నగరంలో మల్టీ-లెవెల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌ను మరింత శక్తివంతం చేస్తోంది.
ఇది SRDP కింద పూర్తి అయిన 23వ ఫ్లైఓవర్. మొత్తం 42 పనులలో ఇప్పటి వరకు 37 పూర్తయ్యాయి. మిగిలిన ఫలక్‌నుమా మరియు శాస్త్రిపురం ROB పనులు త్వరలో పూర్తి కానున్నాయి. అదే సమయంలో GHMC పరిధిలో నగర అభివృద్ధికి భారీ బడ్జెట్‌తో ప్రణాళికలు రూపొందించారు. రూ.7032 కోట్ల వ్యయంతో 28 ఫ్లైఓవర్లు, 13 అండర్‌పాస్‌లు, 4 ROBలు, 3 రైల్వే అండర్‌బ్రిడ్జిలు మరియు 10 రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇవి నగర అభివృద్ధిని దిశగా తీసుకెళ్లే ప్రధాన బావుటాలు కావనున్నాయి. దీంతో హైదరాబాద్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.