Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
- By Gopichand Published Date - 07:43 AM, Sun - 15 October 23
![Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/03/petrol-price-in-india.jpg)
Petrol Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. వారం చివరి ట్రేడింగ్ రోజున బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలో 5.69 శాతం పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం బ్యారెల్‌కు $ 90.89 వద్ద ట్రేడవుతోంది. WTI క్రూడ్ ఆయిల్ ధరలో కూడా 5.77 శాతం పెరుగుదల కనిపించింది. ఇది బ్యారెల్‌కు $ 87.69 స్థాయిలో ఉంది. దీని తర్వాత దేశంలోని పలు నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.96.72, డీజిల్ రూ.89.62 చొప్పున విక్రయిస్తున్నారు. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ.94.27గా విక్రయిస్తున్నారు. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ రూ.106.03, డీజిల్ రూ.92.76గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.102.63, డీజిల్ రూ.94.24గా విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో పెట్రోల్ రూ. 109. 66, లీటర్ డీజిల్ రూ. 97.82 కాగా విజయవాడలో పెట్రోల్ రూ. 111.83, లీటర్ డీజిల్ రూ. 99.58గా ఉంది.
Also Read: Gold- Silver Rates: సామాన్యులకు భారీ షాక్.. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్స్..!
We’re now on WhatsApp. Click to Join.
గత కొన్ని నెలలుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. భారత్ లో 2017 జూన్ నుంచి పెట్రోల్ ధరలను ప్రతి రోజు సవరిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లను ప్రతి రోజు ఉదయం 6 గంటలకు సవరిస్తారు. అయితే, ఇవి వాల్యూ ఆధారిత పన్ను (VAT), సరుకు రవాణా ఛార్జీలు, స్థానిక పన్నులు మొదలైన వాటి కారణంగా రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి. 2017 జూన్ కు ముందు రెండు వారాలకు ఒకసారి ఇంధన ధరలను సవరించేవారు.
మీ నగరంలో పెట్రోల్, డీజిల్ కొత్త ధరలను SMS ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ధరను తెలుసుకోవడానికి BPCL వినియోగదారులు <డీలర్ కోడ్> అని వ్రాసి 9223112222 నంబర్‌కు పంపాలి. ఇండియన్ ఆయిల్ కస్టమర్ల ధరను తెలుసుకోవడానికి RSP <డీలర్ కోడ్>ని 9224992249 నంబర్‌కు పంపండి. HPCL కస్టమర్లకు ఇంధన ధరను తెలుసుకోవడానికి, HPPRICE <డీలర్ కోడ్> అని వ్రాసి 9222201122కు పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![SEBI Bans Vijay Mallya: విజయ్ మాల్యాకు షాకిచ్చిన సెబీ.. మూడేళ్లపాటు నిషేధం..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-Screenshot-2024-07-26-212814_11zon.png)
SEBI Bans Vijay Mallya: విజయ్ మాల్యాకు షాకిచ్చిన సెబీ.. మూడేళ్లపాటు నిషేధం..!
జూలై 26, 2024న జారీ చేసిన ఆర్డర్లో విజయ్ మాల్యా ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి వచ్చే మూడేళ్లపాటు లిస్టెడ్ కంపెనీ లేదా ఏ ప్రతిపాదిత లిస్టెడ్ కంపెనీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండరు.