Parsanal Lone: 30 సెకన్లలో రూ.5లక్షల పర్సనల్ లోన్ పొందొచ్చు.. ఎక్కడో తెలుసా?
ప్లిప్‌కార్ట్ లో పర్సనల్ లోన్ పొందాలంటే కేవలం 30 సెకన్లు చాలు. ఈ కొద్ది సమయంలోనే మీకు పర్సనల్ లోన్ మంజూరు అవుతుంది. ఈ విషయాన్ని ప్లిప్‌కార్ట్ , యాక్సిస్ బ్యాక్ సంయుక్తంగా ప్రకటించాయి.
- Author : News Desk
Date : 07-07-2023 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
పర్సనల్ లోన్ (Parsanal Lone) కోసం మీరు ఎదురు చూస్తున్నారా? అయితే, ప్లిప్‌కార్ట్ (Flipkart) ఆ అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ప్లిప్‌కార్ట్ ఇకపై వ్యక్తిగత రుణాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. గరిష్టంగా మూడేళ్ల కాల వ్యవధిపై రూ.5లక్షల వరకు రుణాలను అందిస్తామని ప్లిప్‌కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డు (Credit card) లు వంటి సెక్యూర్డ్ రుణాలపై ఓ వైపు ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో ప్లిప్ కార్ట్ ఈ ప్రకటన విడుదల చేయడం ఆసక్తికరంగా మారింది. అయితే, రుణాలు మంజూరు చేసేందుకు ప్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్‌తో జతకట్టింది. ఇప్పటికే ఈ రెండు సంస్థలు కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా పర్సనల్ లోన్ విభాగంలోకి ఈ రెండు అడుగు పెట్టడం గమనార్హం.
పర్సనల్ లోన్ ఇలా పొందండి..
ప్లిప్‌కార్ట్ లో పర్సనల్ లోన్ పొందాలంటే కేవలం 30 సెకన్లు చాలు. ఈ కొద్ది సమయంలోనే మీకు పర్సనల్ లోన్ మంజూరు అవుతుంది. ఈ విషయాన్ని ప్లిప్‌కార్ట్ , యాక్సిస్ బ్యాక్ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ లోన్ పొందాలంటే కస్టమర్ తన పాన్ కార్డు, పుట్టిన తేదీ, వృత్తి వివరాలు అందించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన తరువాత మీకు ఎంత లోన్ అందుబాటులో ఉంటుందో యాక్సిస్ బ్యాంక్ సూచిస్తుంది. నిబంధనల ప్రకారం.. గరిష్ట పరిమితికి లోబడి మీకు కావాల్సినంత రుణం, కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. మీరు తీసుకున్న రుణం వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఆరు నెలల నుంచి 36 నెలల పాటు అవకాశం ఉంటుంది.
అయితే, మీరు రుణం తీసుకున్న తరువాత.. ప్రతీ నెలా మీరు రుణం ఎంత తీసుకున్నారు. రీపేమెంట్ షెడ్యూల్ వంటి వివరాలను ప్లిప్‌కార్డ్ అలర్ట్ చేస్తుంది. మారుతున్న లైఫ్ స్టయిల్‌కు అనుగుణంగా వినియోగదారుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని ప్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ నిర్ణయంపై యాక్సిస్ బ్యాంక్ ప్రెసిడెంట్, డిజిట్ అండ్ ట్రాన్సఫర్మేషన్ ప్రెసిడెంట్ సమీర్ శెట్టి మాట్లాడుతూ.. ప్లిప్‌కార్ట్ తో ఈ ఒప్పందం వల్ల తమ రుణ వితరణ మరింత విస్తృతం కానుందని తెలిపారు.
Realme Narzo 60 5G: రియల్ మీ నుంచి అద్భుతమైన స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ మాములుగా లేవుగా?