PBKS vs DC: నెమ్మదిగా ఆరంభించిన ఢిల్లీ క్యాపిటల్స్
పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 08:05 PM, Wed - 17 May 23

PBKS vs DC: పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఢిల్లీ ఆరంభంలోనే తడబడింది. 2 ఓవర్లు ముగిసేలోగా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 6 పరుగులు మాత్రమే రాబట్టింది. మూడో ఓవర్ వరకు వార్నర్, పృథ్వీ షాలను సామ్ కరణ్, రబడ అద్భుతమైన బౌలింగ్ తో కట్టడి చేశారు. కానీ 4 ఓవర్ నుంచి ఓపెనర్స్ నెమ్మదిగా బ్యాట్ కు పని చెప్పడం ప్రారంభించారు. ఢిల్లీ 5 ఓవర్ కి వార్నర్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. ఇక పృథ్వీ షా 18 బంతుల్లో 26 పరుగులు చేసి మూడు ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు.
IPL 2023లో ప్లేఆఫ్‌లకు చేరుకోవాలంటే పంజాబ్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలి. ఈ సీజన్‌లో పంజాబ్ ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడగా, అందులో 6 మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు మ్యాచ్ ల్లో ఓడింది. పంజాబ్ పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లు దారుణంగా విఫలమయ్యారు. . కెప్టెన్ డేవిడ్ వార్నర్ మినహా జట్టులోని ఇతర బ్యాట్స్‌మెన్‌లు ప్రత్యేకంగా ఆడిందేమి లేదు. బౌలింగ్‌లో ఇషాంత్ శర్మ మరియు అక్షర్ పటేల్ కొంత వరకు ప్రభావవంతంగా కనిపించారు.
Read More: Kodali Nani: కొడాలి నానీని మరొకసారి అసెంబ్లీ గడప తొక్కనీయోద్దు