Pawan Kalyan: ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన పవన్ కళ్యాణ్
- By Balu J Published Date - 09:24 PM, Fri - 17 May 24

Pawan Kalyan: ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించిన ప్రేమకు మనస్పూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అంటూ జనసేన అధినేత, సినీ నటుడు ఎమోషన్ అయ్యారు. ‘‘సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం , అభివృద్ది , శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యులు అయినందుకు నా అభినందనలు’’ అంటూ రియాక్ట్ అయ్యారు.
‘‘అత్యధికంగా 81.86% ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియావారు, పౌర సంఘాలవారు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.