PK ON YCP: వైసీపీపై పవన్ సెటైరిక్ ప్రతిజ్ఞ
ఆవిర్భావ సభలో జనసేనని పవన్ వైసీపీ పై సెటైరిక్ గా ఉన్న ప్రతిజ్ఞ సభికుల్ని ఆయకట్టు కుంది. ఆ ప్రతిజ్ఞ ఇలా ఉంది..'' ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం.
- By Hashtag U Published Date - 09:26 PM, Mon - 14 March 22

ఆవిర్భావ సభలో జనసేనని పవన్ వైసీపీ పై సెటైరిక్ గా ఉన్న ప్రతిజ్ఞ సభికుల్ని ఆయకట్టు కుంది. ఆ ప్రతిజ్ఞ ఇలా ఉంది..” ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం. న్యాయవ్యవస్థను లెక్కే చెయ్యం. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడేస్తాం. ఉద్యో గులను ముప్పుతిప్పలు పెడతాం, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తాం. రాష్ట్ర రహదారులను గుంతలమయం చేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగ్గొడతాం. అలా విరగ్గొట్టేంత వరకు విశ్రమించం.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50 శాతం వాటా మేం లాక్కుంటాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థికమూలాలను దెబ్బకొడతాం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని చెబుతాం… కానీ అధికారంలోకి రాగానే వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం, వారు ఆత్మహత్యలు చేసుకుంటామంటే ప్రోత్సహిస్తాం. ఇసుకను అప్పడంలా కరకర నమిలేస్తాం. సహజ వనరులను మొత్తం వాడేసుకుంటాం.
దేవతా విగ్రహాలను ధ్వంసం చేసేవారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తాం. పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలను చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఆదాయ వనరులను పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే… చావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగ్గొట్టిస్తాం… మా వైసీపీ ఎంపీ అయినాసరే!
ఒక్క ఛాన్స్…. ఒక్క ఛాన్స్… ఒక్క చాన్సిస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళతాం. ఇంకొక్క చాన్సిస్తే స్కూలుకెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాగేసుకుంటాం..” అంటూ. వైసీపీ నేతల ప్రతిజ్ఞ ఉంటుందని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ప్రతిజ్ఞ సెటైర్లు వేస్తూ చెప్పటం జనసైనికుల్లో జోష్ నిపింది.