Janasena : మంగళగిరి జనసేన కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్
- Author : Prasad
Date : 15-08-2022 - 1:33 IST
Published By : Hashtagu Telugu Desk
మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర స్ఫూర్తిని కొద్దిరోజులు మాత్రమే కాకుండా చిరకాలం గుర్తించాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన వారందరి త్యాగాలను స్మరించుకోవడంతోపాటు వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు జనసేన ముందుకు వచ్చిందన్నారు. సైద్ధాంతిక బలం లేని కారణంగానే రాజకీయ పార్టీలు ముందుకు సాగడం లేదన్నారు. కులం, మతం, ప్రాంతీయత ప్రాతిపదికన ముందుకు సాగే పార్టీల మనుగడ కొద్ది రోజులకే పరిమితమవుతుందని అన్నారు. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు ఏనాడూ కుల, మతాలకు అతీతంగా పనిచేశారన్నారు.
జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ గావించారు.
Full Album link: https://t.co/5y198DbXtD#IndiaAt75 #AmritMahotsav pic.twitter.com/EOdcWLqPLe
— JanaSena Party (@JanaSenaParty) August 15, 2022