Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ రియాక్షన్..ఇది సంబంధం లేని ప్రశ్న
Allu Arjun Arrest : ఇది సంబంధలేని ప్రశ్నఅని అన్నారు. ఇక్కడ మనుషులు చనిపోతే.. సినిమాల గురించి ప్రస్తావించడం ఏంటి అని కాస్త ఫైర్ అయ్యారు
- By Sudheer Published Date - 05:14 PM, Sat - 28 December 24

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ (Allu Arjun Arrest) కావడం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఈ అరెస్ట్ పై చాలామందే స్పందించారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) దీనిపై స్పందించారు.
తాజాగా శనివారం పవన్ కళ్యాణ్ అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబు పై దాడి ఘటనపై ఆయనను పరామర్శించేందుకు వచ్చారు. పరామర్శ అనంతరం అక్కడ మీడియా సమావేశంలో మాట్లాడాగా.. కొంత మంది అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ ను ప్రశ్నించారు . దీనిపై ఆయన మాట్లాడుతూ..ఇది సంబంధలేని ప్రశ్నఅని అన్నారు. ఇక్కడ మనుషులు చనిపోతే.. సినిమాల గురించి ప్రస్తావించడం ఏంటి అని కాస్త ఫైర్ అయ్యారు. ఈ సమస్య కంటే పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలని మీడియా కు పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
పుష్ప2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ చనిపోవడం తో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటన కు కారణమైన వారందరిపై కేసులు నమోదు చేసింది. అల్లు అర్జున్ ను A11 గా చేర్చి అరెస్ట్ చేయడం , మధ్యంతర బెయిల్ ద్వారా అల్లు అర్జున్ బయటకు రావడం జరిగింది. ఈ ఘటనకు రాజకీయ రంగు అంటుకోవడం తో మరింత వైరల్ అయ్యింది.
Read Also : AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్