17 Crore Injection: ఒక్క ఇంజక్షన్ డోస్ ఖరీదు రూ.17 కోట్లు
సాధారణంగా మనం అనారోగ్యంతో ఉంటే ఇంజెక్షన్ తీసుకుంటాము. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. రూ.50, రూ.100 అవుతుంది. కానీ ఓ ఇంజెక్షన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. ఒక్క డోస్ ఖరీదు రూ.17 కోట్లు. ప్రపంచంలోని అన్ని రకాల ఇంజెక్షన్ల కంటే ఈ ఇంజెక్షన్ ధర ఎక్కువ.
- Author : Praveen Aluthuru
Date : 09-11-2023 - 7:04 IST
Published By : Hashtagu Telugu Desk
17 Crore Injection: సాధారణంగా మనం అనారోగ్యంతో ఉంటే ఇంజెక్షన్ తీసుకుంటాము. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఎంత ఉంటుంది. రూ.50, రూ.100 అవుతుంది. కానీ ఓ ఇంజెక్షన్ ఖరీదు తెలిస్తే మతిపోతుంది. ఒక్క డోస్ ఖరీదు రూ.17 కోట్లు. ప్రపంచంలోని అన్ని రకాల ఇంజెక్షన్ల కంటే ఈ ఇంజెక్షన్ ధర ఎక్కువ.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ జోల్జెన్స్మా. వెన్నెముక కండరాల క్షీణతతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ ఇంజెక్షన్ ఇవ్వబడుతుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉపయోగించే వెన్నెముక కండరాల క్షీణతకు జన్యు చికిత్స మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే, ఈ జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ను భారత ప్రభుత్వం ఆమోదించలేదు. ప్రభుత్వ అనుమతితోనే విదేశాల నుంచి ఈ జోల్జెన్స్మా ఇంజక్షన్ ను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అయితే దీని ధర ఒక్క డోసు రూ.17 కోట్లు కావడంతో.. అంత భారీ మొత్తంలో ఖర్చు చేయలేక చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ ఔషధం ప్రయోజనకరంగా ఉంటుందని ఆధారాలు సూచిస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లలో ఒకటైన జోల్జెన్స్మా ధర రూ. 17 కోట్లు. కొన్ని సందర్భాల్లో వీటిని విదేశాల నుంచి తెప్పించి.. ఇంజక్షన్ కొనుగోలు చేసేందుకు బాధితులు విరాళాలు సేకరించారు. అయితే తాజాగా కర్నాటకలో ఇలాంటి వెన్నెముక కండరాల క్షీణత కేసు నమోదైంది. 15 నెలల చిన్నారికి ఈ అరుదైన వ్యాధి సోకడంతో.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి ప్రస్తావించారు. 15 నెలల చిన్నారి చికిత్సకు సహకరించాలని కర్ణాటక ముఖ్యమంత్రి ప్రధాని మోదీని అభ్యర్థించారు.
Also Read: Shubman Gill-Sara: గిల్ పై సారా ట్వీట్.. కానీ ట్విస్ట్