HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Pakistan Airlines Flight Seized Malaysia Unpaid Dues

Pakistan: మలేషియాలో పాక్ కి అవమానం.. బకాయిలు చెల్లించలేదని విమానం సీజ్?

తాజాగా మలేషియాలో పాకిస్థాన్ కు ఘోర అవమానం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్ లో

  • Author : Anshu Date : 31-05-2023 - 7:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan
Pakistan

తాజాగా మలేషియాలో పాకిస్థాన్ కు ఘోర అవమానం జరిగింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు సంబంధించిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్ లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా తాజాగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు మలేషియా అధికారులు వెల్లడించారు. కాగా ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సుమారుగా 4 మిలియన్ల డాలర్లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా రూ.33 కోట్లు బకాయి పడింది.

అయితే ఈ సంస్థ ఇప్పటికే చాలాసార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు వెళ్ళి నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. అయితే ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేశారు.

ఆ సమయంలో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాము. అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని ఆయన అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. కాగా గతకొంతకాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మళ్లీ పాకిస్తాన్ ఇరుకున పడ్డట్టు అయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • flight
  • Malaysia
  • malaysia unpaid dues
  • pakistan
  • pakistan airlines

Related News

Ishaq Dar

Pakistan Deputy Prime Minister: పాక్‌ ఉప ప్రధానికి పరువు పాయే..

Ishaq Dar  పాకిస్థాన్‌లో జరిగిన ఓ దౌత్యపరమైన కార్యక్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. శాంతి చర్చల కోసం విచ్చేసిన ఈజిప్ట్ విదేశాంగ మంత్రికి స్వాగతం పలుకుతూ పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Pakistan’s Deputy PM and Foreign Minister Ishaq Dar falls ahead of the US-Iran mediation talks. pic.twitter.com/h6xqFoOqMB — Aditya […]

  • Pakistan

    పాకిస్థాన్ వేదిక‌గా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు?!

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd