Earthquake In Afghan: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. 155 మంది మృతి
బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది.
- By Balu J Updated On - 11:30 AM, Wed - 22 June 22

బుధవారం తెల్లవారుజామున తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విపత్తులో దాదాపు 155 మంది మరణించినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు. పాక్టికా ప్రావిన్స్‌లో 6 తీవ్రతతో భూకంపం జరిగినట్టుగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బఖ్తర్ వార్తా సంస్థ ఈ వివరాలను రిపోర్ట్ చేసింది. సహాయక చర్యలు చేపట్టేందుకు హెలికాప్టర్‌లో ప్రత్యేక టీమ్స్ అక్కడికి చేరుకుంటున్నట్లు సమాచారం. కాగా ఈ ఘటనలో ఎంతోమంది గాయపడ్డారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది.
BREAKING: #Afghanistan state-run news agency reports at least 155 killed in #earthquake in country's eastern Paktika province. pic.twitter.com/lAWicfKMwI
— Amit Shukla (@amitshuklazee) June 22, 2022
Related News

Iran : ఇరాన్‌లో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్ పై 6.1 తీవ్రత నమోదు
ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. శనివారం తెల్లవారుజామున దక్షిణ ఇరాన్‌లో భూప్రకంపనలు వచ్చాయి. ఇరాన్ మీడియా ప్రకారం యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) దాని తీవ్రత 6.0గా ఉందని తెలిపింది. భూకంపం 10 కిమీ (6.21 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. ఇటీవలి సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను చవిచూసిన ఇ