Corona: కొంపముంచిన “నాట్ ఎట్ రిస్క్” నిబంధన
'నాట్ ఎట్ రిస్క్' రూల్ మరోసారి ఆరోగ్యశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది.
- Author : hashtagu
Date : 18-12-2021 - 2:35 IST
Published By : Hashtagu Telugu Desk
‘నాట్ ఎట్ రిస్క్’ రూల్ మరోసారి ఆరోగ్యశాఖ అధికారులను ముప్పు తిప్పలు పెట్టింది. సుడాన్ నుండి వచ్చిన ఆ దేశ పౌరుణ్ణి కరోనా టెస్ట్ రిపోర్ట్ రాకుండానే ‘నాట్ ఎట్ రిస్క్’ దేశం నుండి వచ్చాడని ఎయిర్ పోర్ట్ సిబంది సదరు వ్యక్తిని పంపించేశారు. అతను వెళ్ళిపోయాక తన రిపోర్టులో ఓమిక్రాన్ పాజిటివ్ తేలింది. అతన్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయగా అడ్రస్, ఫోన్ నెంబర్ కరెక్ట్ కాదని తెలుసుకున్న అధికారులకు చెమటలు పట్టాయి. అతని ట్రేస్ చేయడానికి అధికారులు ముప్పు తిప్పలు పడ్డారు. ‘నాట్ ఎట్ రిస్క్’ నిబంధనతో, అలాగే ఎయిర్ పోర్ట్ సిబంది నిర్లక్ష్యంతో ఆరోగ్యశాఖ సిబంధి నానా అవస్థలు పడ్తున్నారు.