Indians in Ukraine: ఉక్రెయిన్ నుంచి బయటపడేందుకు భారతీయుల కష్టాలు..!
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడేందుకు భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా చాలా మంది ఉక్రెయిన్ లోనే చిక్కుకున్నారు.
- By Hashtag U Published Date - 09:46 AM, Thu - 3 March 22

ఉక్రెయిన్ రష్యా యుద్ధం నేపథ్యంలో అక్కడి నుంచి బయటపడేందుకు భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే చాలామంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాగా చాలా మంది ఉక్రెయిన్ లోనే చిక్కుకున్నారు. ఉక్రెయిన్ లో పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో ఖార్కివ్‌ను తక్షణమే విడిచిపెట్టాలని కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం సలహాను అనుసరించి, చాలా మంది విద్యార్థులు తమ పాస్‌పోర్ట్‌లతో పెసోచిన్ (11 కిలోమీటర్ల దూరం)కి నడవడం ప్రారంభించారు. బేబీ, పెసోచిన్ లేదా బెజ్లియుడోవ్కాకు మారాలని.. సాయంత్రం 6 గంటలకు (ఉక్రెయిన్ కాలమానం ప్రకారం) ఖార్కివ్ నుండి బయలుదేరాలని కోరినట్లు ప్రసంజీత్ పట్నానాయక్ అనే విద్యార్థి తెలిపారు. రష్యా ప్రభుత్వం దాడులను వేగవంతం చేయడానికి ముందు భారతీయ విద్యార్థులు నగరం విడిచి వెళ్లేందుకు ఆరుగంటల సమయం ఇచ్చింది. దీంతో చాలామంది ఖార్కివ్ నుండి తప్పించుకోవడానికి బుధవారం ఒడిశా విద్యార్థులు కొందరు రైళ్లను పట్టుకోగలిగారు. అయితే అబ్బాయిలను స్థానికులు ఎక్కడానికి అనుమతించలేదు.
ఉదయం నుంచి తాను, అతని స్నేహితులు రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే కుదరలేదని విద్యార్థి ప్రసంజీత్ చెప్పారు. వారు కేవలం భారతీయ విద్యార్థులను లోపలికి అనుమతించరని.. ఇప్పుడు తమ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవడం లేదని విద్యార్థి ప్రసంజీత్ ఆవేదన వ్యక్తం చేశారు. మూడు గంటల్లోగా ఖార్కివ్ నుండి బయటకు వెళ్లమని భారత రాయబార కార్యాలయం మమ్మల్ని కోరిందని..ఎటువంటి సహాయం లేకుండా అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
ఎక్కువ మంది ఒడిశా విద్యార్థులు చదువుకున్న ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీని కూడా రష్యా క్షిపణులు ధ్వంసం చేశాయి. ఖార్కివ్‌లోని వోక్జల్ మరియు స్టూడెంట్స్‌కా స్టేషన్‌లకు చేరుకోవడానికి రైళ్లను ఎక్కగలిగిన చాలా మంది విద్యార్థులు మెట్రో సొరంగాల గుండా నడిచారు. తాము సరిహద్దుకు చేరుకోగలమో లేదో మాకు తెలియదు కానీ మేము ఇప్పుడు కనీసం ఖార్కివ్ నుండి బయటపడ్డామని. అందరూ ఈ నగరం నుండి తప్పించుకోవడానికి చివరి ప్రయత్నం చేస్తున్నారని విద్యార్థులు తెలిపారు.
Photo Credit – Twitter