HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Notice To Kadapa Ycp Office

Notice to YCP Office : వైసీపీ ఆఫీస్ కు నోటీసులు..ఇది ఎక్కడో తెలుసా..?

ఇప్పటికే వైజాగ్ , అనకాపల్లి తదితర పార్టీ ఆఫీస్ లకు నోటీసులు జారీచేయడంతో.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది

  • Author : Sudheer Date : 24-06-2024 - 11:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kadapa Ycp Office
Kadapa Ycp Office

ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ (Jagan) కు వరుస షాకులు ఇస్తూనే ఉంది కూటమి ప్రభుత్వం. రుషికొండ ఫై నిర్మించుకున్న ప్యాలెస్ దగ్గరి నుండి మొదలుపెడితే..ఈరోజు కడప వరకు..అన్ని జిలాల్లో అక్రమంగా జగన్ నిర్మించుకున్న కట్టడాల ఫై వరుసగా నోటీసులు ఇస్తూ వస్తుంది.

ఇప్పటికే తాడేపల్లి లో నిర్మాణం లో ఉన్న వైసీపీ ఆఫీస్ ను కూల్చివేయగా..మిగతా చోట్లా నోటీసు లు ఇస్తూ వస్తున్నారు అధికారులు. ఇప్పటికే వైజాగ్ , అనకాపల్లి తదితర పార్టీ ఆఫీస్ లకు నోటీసులు జారీచేయడంతో.. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం అనుమతులు లేకుండా కార్యాలయాలను ఎలా నిర్మించిందనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా ఇప్పుడు కడప పార్టీ ఆఫీస్ సైతం అక్రమంగా నిర్మించుకున్నారని నోటీసులు జారీ చేసారు. కడప-చెన్నై జాతీయ రహదారిపై సర్వే నంబర్ 424/1లో వైసీపీ ఆఫీస్‌ నిర్మాణం చేశారు. రెండెకరాల ప్రభుత్వ స్థలం ఏడాదికి రూ.3 వేలు చొప్పున 33 ఏళ్లకు లీజ్‌ తీసుకున్నారు. రూ.కోట్ల విలువ చేసే భూమిని లీజుకు తీసుకున్న వైసీపీ..నిబంధనల అతిక్రమణ, అనుమతులు లేకుండా పార్టీ ఆఫీస్‌ నిర్మించారని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్లాన్‌ అప్రూవల్‌ కూడా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

సామాన్య ప్రజలు తన సొంత స్థలంలో చిన్నపాటి షెడ్డు వేసుకుంటే అన్ని శాఖల అధికారులు వచ్చి..నానా రభస చేస్తారు. అనుమతులు తీసుకోకుండా పనులెలా చేస్తారంటూ గొడవ చేస్తారు. కట్టడాన్ని కూల్చేస్తామంటారు. ఇలా విధుల పట్ల ఎంతో అంకితభావం ప్రదర్శించే అధికారులకు ఐదేళ్లుగా రాజప్రాసాదాల మాదిరిగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయాల భవనాలు కనిపించలేదు. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న 26 భవనాల్లో ఒక్కటి తప్ప, మిగతా 25 చోట్ల అనుమతులే లేవు.

అడ్డగోలుగా చేపట్టిన ఈ భవనాల నిర్మాణ పనులను అడ్డుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. అక్రమ నిర్మాణాలను అడ్డుకోని కారణంగా నగరపాలక సంస్థలు ఫీజుల కింద కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయాయి. కొన్నిచోట్ల నోటీసులిచ్చి చేతులు దులిపేసుకున్నారు. విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు, మచిలీపట్నం, కర్నూలు, కడప ఇలా అనేకచోట్ల గత ఐదేళ్లూ వైసీపీనేతల సేవలో పట్టణ ప్రణాళిక అధికారులు తరిస్తూ, అక్రమ నిర్మాణాలను గాలికి వదిలేశారని కూటమి ఆరోపిస్తుంది.

Read Also : Rain Alert : హైదరాబాద్‌కు భారీ వర్షసూచన.. ఉత్తరాంధ్రలోనూ తేలికపాటి జల్లులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • jagan
  • kadapa ycp office
  • notice
  • YCP Offices

Related News

Gade Venkatreddy

Gade Venkatreddy : మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి (86) శుక్రవారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్యంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గాదె వెంకటరెడ్డి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, వివిధ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవ

  • Tdp Mla Bandaru Sravani

    Mahanadu : మహిళా సాధికారతే టీడీపీ లక్ష్యం.. మహానాడులో ఎమ్మెల్యే బండారు శ్రావ‌ణి

  • ACB raids

    ACB Raids : మాజీ ఏపీ భవన్ అధికారి ఇళ్ల‌లో ఏసీబీ సోదాలు.. కోట్ల విలువైన అక్రమ ఆస్తుల గుర్తింపు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

  • Online Petrol

    Petrol Price : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు.. ప‌దిరోజుల్లో నాలుగు సార్లు

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd