Public Health Emergency : మంకీపాక్స్‌ని పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన న్యూయార్క్
మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా న్యూయార్క్ నగరంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది
- By Prasad Published Date - 11:51 AM, Sun - 31 July 22

మంకీపాక్స్ వ్యాప్తి కారణంగా న్యూయార్క్ నగరంలో పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. న్యూయార్క్ రాష్ట్రంలో మొత్తం 1,383 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని మేయర్ ఎరిక్ ఆడమ్స్, సిటీ హెల్త్ కమిషనర్ అశ్విన్ వాసన్ ప్రకటించారు. న్యూయార్క్ నగరం ప్రస్తుతం మంకీపాక్స్ వ్యాప్తికి కేంద్రంగా ఉందని.. సుమారు 150,000 మంది న్యూయార్క్ వాసులు ప్రస్తుతం మంకీపాక్స్ ఎక్స్‌పోజర్‌కు గురయ్యే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు. సిటీ హెల్త్ కోడ్ కింద అత్యవసర ఆదేశాలు జారీ చేయడానికి, వ్యాప్తిని నివారించడానికి కోడ్ నిబంధనలను సవరించడానికి ఆరోగ్య శాఖను డిక్లరేషన్ అనుమతిస్తుందని తెలిపారు.