Modi Ji Thali: మోడీ జీ థాలీని ప్రారంభించిన న్యూ జెర్సీ రెస్టారెంట్.. అందులో స్పెషల్ ఇదే?
ఈనెల ఆఖరిలో రాష్ట్ర పర్యటన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ పరిచేందుకు అమెరికా సిద్ధమవ
- Author : Anshu
Date : 12-06-2023 - 7:01 IST
Published By : Hashtagu Telugu Desk
ఈనెల ఆఖరిలో రాష్ట్ర పర్యటన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ పరిచేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అధికారిక ప్రదర్శనతో పాటుగా ప్రధాని నరేంద్ర మోడీకి అంకితం చేసిన ప్రత్యేక థాలీ రూపంలో కూడా అద్భుతమైన స్వాగతానిమిత్తం అందజేయనున్నారు. ఇది ఇలా ఉంటే న్యూజెర్సీకి చెందిన ఒక రెస్టారెంట్ లో ఆయన అమెరికాకు రాకముందే మోడీ జీ థాలీ ని ప్రారంభించినట్లు తెలిసింది.
మోడీ జీ థాలీ పేరుతో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వంటకాలను అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని ఈ ప్లేట్ ను ప్రారంభించారు. రానున్న కాలంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కి మరో థాలీ అందించాలనేది రెస్టారెంట్ యజమాన్యం ప్లాన్ చేసింది. భారత్ లోని వివిధ ప్రాంతాలకు చెందిన వంటకాలు కూడా ఈ ప్లేట్ అందుబాటులో ఉంటాయి. అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ నెలలో అమెరికా పర్యటనకు వెళ్ళనున్న సంగతి తెలిసిందే.
కాగా జూన్ 21న ప్రారంభమయ్యే నాలుగు రోజుల పర్యటనలో అమెరికా అధ్యక్షుడు, ప్రథమ మహిళ జూన్ 22న ప్రధాని మోడీకి రాష్ట్ర విందులో ఆతిథ్యం ఇవ్వనున్నారు. కాగా ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వారం రోజుల ముందు అమెరికా జాతీయ జాతీయ భద్రత సలహాదారు బేక్ సుల్లివన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జూన్ 13న పలు అంశాలపై చర్చించడానికి ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈ సందర్భంగా చెఫ్ శ్రీపాద్ కులకర్ణి తయారుచేసిన థాలీలో కిచిడి,రసగుల్లా, సర్సన్ కా సాగ్, కాశ్మీరీ దమ్ ఆలు, ఇడ్లి, డోక్లా, చాంచ్, పాపడ్ వంటి భారతీయ సంప్రదాయ వంటకాలు ఉన్నాయి. కాగా అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రవాసుల డిమాండ్ ల మేరకు థాలీ ఏర్పాటు చేయబడింది. మెనులో మిల్లెట్ విస్తృతంగా ఉపయోగించబడింది.