Covid: దేశంలో కొత్తగా కరోనా కేసులు 7,145
దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది.
- By Balu J Published Date - 02:36 PM, Sat - 18 December 21

దేశంలో కొత్తగా 7,145 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 569 రోజుల కనిష్ఠానికి చేరింది. ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 84,565 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,41,71,471కు పెరిగింది. అలాగే మృతుల సంఖ్య మొత్తం 4,77,158కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఓమిక్రాన్ బుసలు కొడుతున్న నేపథ్యంలో కేంద్రం వ్యాక్సిన్ చర్యలను వేగవంతం చేసింది.