Maratha Reservation: ఎమ్మెల్యే ఇంటికి నిప్పు.. పూర్తిగా కాలిన ఎమ్మెల్యే నివాసం
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
- Author : Praveen Aluthuru
Date : 30-10-2023 - 1:42 IST
Published By : Hashtagu Telugu Desk
Maratha Reservation: మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల అంశం తీవ్ర వేడెక్కింది. మరాఠా రిజర్వేషన్లను కోరుతూ ఆందోళన కారులు ప్రజాప్రతినిధులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఎన్సీపీ (NCP) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకే ఇంటిపై తొలుత ఆందోళనకారులు రాళ్లు రువ్వినట్లు సమాచారం. అనంతరం ఇంటిని ధ్వంసం చేసి నిప్పంటించారు. దీంతో ఎమ్మెల్యే నివాసంలో అగ్ని జ్వాలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. ప్రస్తుతం ఈ దీనికి సంబందించిన వీడియో సోషల్ మిడిల్ వైరల్ గా మారింది.ఈ చర్యను పలువురు తప్పుబడుతున్నారు.రిజర్వేషన్ కోరితే శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలనీ, అవసరమైతే కోర్టులో తేల్చుకోవాలని ఇలా ఇళ్లను ధ్వంసం చేయడం సరికాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఎవరైనా ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
#WATCH | Beed, Maharashtra: Maratha reservation agitators vandalised and set the residence of NCP MLA Prakash Solanke on fire. pic.twitter.com/8uAfmGbNCI
— ANI (@ANI) October 30, 2023
Also Read: Mrunal Thakur : నెల గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజ్.. టాలీవుడ్ ని ఊపేస్తున్న అమ్మడు..!