Nayanthara & Vignesh: వెంకన్న సాక్షిగా ముహూర్తం ఫిక్స్!
నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
- By Balu J Updated On - 10:37 AM, Sun - 8 May 22

నయనతార, ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ ఎట్టకేలకు తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. తమిళ మీడియా ప్రకారం.. ఒక పండితుడు జూన్ 9ని వారి వివాహ వేడుకకు అనుకూలమైన తేదీగా నిర్ణయించారు. ఈ తేదీనే ఫైనల్ అని తెలుస్తోంది. వీరిద్దరూ తిరుమల తిరుపతి దేవస్థానంలో పెళ్లి చేసుకోనున్నారు. వివాహ వేడుక సాదాసీదాగా, సంప్రదాయబద్ధంగా జరగనుంది. కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించనున్నారు. నయనతార, విఘ్నేష్ మాల్దీవులలో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరికీ గతేడాది నిశ్చితార్థం జరిగింది. నాలుగేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. విఘ్నేష్ శివన్ సినిమా దర్శకుడు. శివన్ డైరెక్ట్ చేసిన “KRK” లో సమంత, నయనతార నటించిన విషయం తెలిసిందే.
Related News

Kamal Haasan: కమల్ పాటకు ట్రెమండస్ రెస్పాన్స్!
హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'విక్రమ్ '