PM Modi Speech: మోదీ “డిజిటల్” వ్యవసాయం
- By HashtagU Desk Published Date - 04:29 PM, Sat - 5 February 22
ఇక్రిశాట్ స్వర్ణోత్సవ లోగోను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఇక్రిశాట్‌లో పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని కూడా మోదీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అందరికీ ఇక్రిశాట్ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెల్పుతూ, ఇక్రిశాట్ 50 ఏళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపారు.
ఇక అజాదీ అమృతోత్సవాల వేళ ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలు జరుపుకుంటుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇక్రిశాట్ సేవలను తాను ఇప్పుడే ప్రత్యక్షంగా చూశానని, టెక్నాలజీని మార్కెట్‌తో జోడించి వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ఇక్రిశాట్ కృషి చేస్తోందన్నారు. వాతావరణ పరిశోధన కేంద్ర రైతులకు ఎంతో ఉపయోగకరమని నరేంద్ర మోదీ అన్నారు.
ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు, ప్రతి ఒక్కరు మానవ నష్టం గురించి చర్చిస్తారు కానీ, మౌలిక సదుపాయలకు జరిగిన నష్టం గురించి ఏ ఒక్కరూ మాట్లాడరని, ప్రస్తుత వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రపంచస్థాయి పరిశోధలనకు భారత్ వేదికగా మారిందని మోదీ చెప్పారు. ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుందని, ఈ పరిశోధనలు చిన్న, మధ్య తరగతి రైతులకు ఎంతో ఉపయోగకరమని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.