Yuva Galam Padayatra: అద్దంకిలో 170వరోజు లోకేష్ యువగలం పాదయాత్ర
యువగళం పాదయాత్ర 170వరోజు అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభించారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు.
- Author : Praveen Aluthuru
Date : 31-07-2023 - 7:45 IST
Published By : Hashtagu Telugu Desk
Yuva Galam Padayatra: యువగళం పాదయాత్ర 170వరోజు అద్దంకి మధురానగర్ నుంచి ప్రారంభించారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ కు సంఘీభావం తెలిపేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను లోకేష్ కు విన్నవించుకున్నారు. టిడిపి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు లోకేష్. అద్దంకి పాతబస్టాండు సెంటర్ లో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. సభలో లోకేష్ మాట్లాడుతూ.. బిసిలపాలిట సైతాన్ గా మారిన జగన్ రెడ్డిని సాగనంపాలని పేర్కొన్నారు. రామ్ నగర్, అంబేద్కర్ విగ్రహం, పాతబస్టాండు, భవానీసెంటర్, గుండ్లకమ్మ బ్రిడ్జి, తిమ్మాయపాలెం మీదుగా సాగిన పాదయాత్ర దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించింది. దాంతో దర్శిలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నారా లోకేష్ కు ఆత్మీయ స్వాగతం పలికారు.
Also Read: Kothagudem : వరదల్లో ప్రజలు..డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ లీడర్స్