Andhra pradesh: వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం
- By hashtagu Published Date - 01:21 PM, Wed - 22 December 21
వైసీపీ నేతలపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లి నారా భువనేశ్వరి పై విమర్శలు చేసిన వారిని ఎవరిని వదిలి పెట్టనని అన్నారు. “నా తల్లిని విమర్శించడం బాధించింది.. నా తల్లిని కించపరిచిన వారిని మా నాన్న వదిలిపెట్టినా నేను వదలను.. మా కుటుంబాన్ని బయటకు లాగాలని ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది, రానున్న కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు” అని నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో వరదబాధితులను ఆదుకోవడానికి వచ్చిన నారా భువనేశ్వరి పై ఎంఎల్ఎ రోజా సహా ఇతరుల విమర్శల పై లోకేష్ స్పందించారు.