Nara Lokesh: జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర చేయండి!
జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.
- By Hashtag U Published Date - 02:40 PM, Mon - 30 May 22

జగన్ పాలనలో సామాజిక న్యాయం ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జలరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్ది రెడ్డి ఉంటే…బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను గేటు బయట ఉంచారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అటెండరు నుంచి ఐఏఎస్ దాకా రెడ్లకు సామాజిన న్యాయం జరిగిందన్నారు. రెడ్డి…రెడ్డి…రెడ్డి..ఎటు చూసినా…సామాజిక న్యాయం ఇదేనాంటూ ప్రశ్నించారు. కుర్చీలు కూడా లేని పదవులు బీసీలకు ఇచ్చారని లోకేశ్ దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం చేయాల్సింది సామాజిన న్యాయభేరి బస్సు కాదు..జగన్ రెడ్డి సామాజిక రైలు యాత్ర అని తీవ్రంగా ధ్వజమెత్తారు. నిజానికి రైలు కూడా సరిపోనన్ని పదవులు…ఒకేసామాజిక వర్గానికి ఇచ్చారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా కనిపిస్తున్నారంటూ విమర్శించారు.