Nagababu: రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న నాగబాబు
నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు, శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
- Author : Gopichand
Date : 06-03-2025 - 10:11 IST
Published By : Hashtagu Telugu Desk
Nagababu: శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కె.నాగబాబు (Nagababu) శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయంలో సిద్ధం చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు సంతకాలు చేశారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధ ప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ సంతకాలు చేశారు.
Also Read: Whatapp Governance: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. ఇకపై 200 సేవలు!
రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న శ్రీ @NagaBabuOffl గారు
శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా శ్రీ కె.నాగబాబు గారు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆదేశాలకు అనుగుణంగా… pic.twitter.com/GhZSgQpIzi
— JanaSena Party (@JanaSenaParty) March 6, 2025
నాగబాబుకు ఎమ్మెల్సీ ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు, శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ బలోపేతానికి నాగబాబు తన వంతు కృషి చేసిన సంగతి తెలిసిందే. 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తారని అంతా భావించారు. అయితే అనుకోకుండా ఆయన తన సీటును త్యాగం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం నాగబాబు తన వంతు కృషి చేశారు.