Murder : హైదరాబాద్ లో దారుణం.. యువకుడిని కత్తితో పొడిచిన దుండగులు
హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో...
- By Prasad Published Date - 10:05 AM, Sun - 21 August 22

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. చాంద్రాయగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడి హత్య కలకలం రేపుతుంది. సంఘటన స్థలానికి ఫలక్‌నామా ఏసీపీ షేక్ జహంగీర్, ఫలక్‌నామా ఇన్స్పెక్టర్ దేవేందర్ , చాంద్రాయగుట్ట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సీతయ్య చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకొన్న సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య , అడిషనల్ డీసీపీ ఆనంద్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. మృతుడు అబూబకర్ అమూది(25) గా గుర్తించారు. సలాల బరకస్, అబ్డుర్ రహ్మాన్ బాక్ర తో జరిగిన గొడవ కారణంగా హత్య జరిగనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరి మధ్‌య ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా తెలుస్తుంది. అబూబకర్ ని కత్తితో పోడవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.