Radhika Merchant : అంబానీ కాబోయే కోడలి భరతనాట్య ప్రదర్శన…స్పెషల్ అట్రాక్షన్ గా అంబానీ మనవడు..!!
- Author : hashtagu
Date : 06-06-2022 - 11:02 IST
Published By : Hashtagu Telugu Desk
అంబానీ ఫ్యామిలీ అంటేనే ఓ స్పెషల్. అందులోనూ ముఖేశ్ అంబానీ ఇంట్లో ఫంక్షన్ అంటే ఎంత లగ్జరీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంబానీ ఫ్యామిలీలోకి కొత్త కోడలు రాబోతోంది. ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీకి కాబోయే భార్య రాధిక మర్చంట్…ఈ మధ్యే ఈమె భరతనాట్య ప్రదర్శన ఇచ్చింది. కాబోయే కోడలి భరతన్యాట్య ఆరంగేట్రం కోసం అంబానీ కుటుంబం కదిలి వచ్చింది. భరతనాట్య ప్రదర్శన కోసం కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ.

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జూన్ 5న ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భరతనాట్య ప్రదర్శన కార్యక్రమానికి బాలీవుడ్ నటులతోపాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంబానీ కుటుంబంతోపాటు కాబోయే కోడలు రాధిక మర్చంట్ కుటుంబ సభ్యులుకూడా కార్యక్రమానికి హాజరయ్యారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ కు 2019లోనే నిశ్చితార్థమైంది. అయితే కొన్నాళ్లుగా భావన థాకర్ వద్ద రాధిక భరతనాట్యంలో శిష్యరికం చేసిందట. భరతనాట్యం నేర్చుకున్న తర్వాత మొదటిసారిగా స్టేజిపై రాధిక నృత్యప్రదర్శన ఇచ్చారు.

తనదైనశైలిలో ప్రదర్శన ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంది రాధిక. కాబోయే కోడలు రాధికతోపాటు అత్త నీతా అంబానీకి కూడా భరతనాట్యంలో ప్రవేశం ఉంది. అందుకే ఈ కార్యక్రమానికి అంబానీ, మర్చంట్ ఫ్యామిలీ అంతా కూడా సంప్రదాయ దుస్తుల్లో వచ్చారు. ఈ కార్యక్రమంలో అంబానీ మనవడు మనువడు పృథ్వీ అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. కాగా భరతనాట్య ప్రదర్శనకు హాజరైన వారిలో బాలీవుడ్ హీరోలు సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, రణవీర్ సింగ్ ఉన్నారు.
