Ban On Dhoni: ధోనీపై నిషేధం.. చెన్నై సారథి ఫైనల్ ఆడతాడా ?
ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే ఖచ్చతంగా మరో మాటకు తావు లేకుండా ధోనీ పేరే చెబుతారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటాడు..
- Author : Praveen Aluthuru
Date : 24-05-2023 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
Ban On Dhoni: ప్రపంచ క్రికెట్ లో కూల్ కెప్టెన్ ఎవరంటే ఖచ్చతంగా మరో మాటకు తావు లేకుండా ధోనీ పేరే చెబుతారు. ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా ఉంటాడు.. సహచరులు తప్పు చేసినా కోప్పడిన సందర్భాలు వేళ్ళ మీద లెక్కించొచ్చు. ధోనీ కోప్పపడడం అరుదుగా జరుగుతుంటుంది. అలాగే అంపైర్లతో వాగ్వాదానికి దిగడం కూడా జరగదు. అలాంటి ధోనీ తొలి క్వాలిఫైయిర్ లో అంపైర్లతో సుధీర్ఘంగా వాదన పెట్టుకోవడం ఆశ్చర్చపరిచింది. ఇప్పుడు ఇదే కారణంతో అతనిపై ఒక మ్యాచ్ నిషేధం వేటు పడబోతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-1లో అంపైర్‌తో వాగ్వాదంకు దిగిన ధోని.. 4 నిమిషాల విలువైన సమయాన్ని వృథా చేశాడు. గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసేందుకు సీఎస్‌కే మతీషా పతిరాణా సిద్దమయ్యాడు. ఈ ఓవర్ వేసేముందు పతిరాణా దాదాపు 9 నిమిషాలు మైదానంలో లేడు. డైరక్ట్‌గా డగౌట్ నుంచి బౌలింగ్ చేయడానికి సిద్దపడిన అతడిని అంపైర్‌లు అడ్డుకున్నారు. రూల్స్ ప్రకారం మైదానంలో లేకుండా అలా నేరుగా వచ్చి బౌలింగ్ చేయకూడదు. ఈ క్రమంలో ధోని అంపైర్ల దగ్గరకు వచ్చి వాగ్వాదానికి దిగాడు. చివరికి చెన్నై కెప్టెన్ అంపైర్లను ఒప్పించడంతో పతిరాణా ఆఓవర్‌ను కొనసాగించాడు.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. ధోనిపై ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై ఆరాతీసినట్లు సమాచారం. ఒకవేళ నిషేదం పడి కీలకమైన ఫైనల్‌కు ధోని దూరమైతే చెన్నైకి గట్టి షాక్ గానే చెప్పాలి.
Read More: LSG vs MI: బంతితో విధ్వంసం సృష్టించిన నవీన్-ఉల్-హక్