The Elephant Whisperers: మాహీతో “ది ఎలిఫెంట్ విస్పర్స్” టీమ్
95వ అకాడమీ అవార్డ్స్‌లో "ది ఎలిఫెంట్ విస్పర్స్" ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. నిజ జీవితంలో ఏనుగు సంరక్షకులు బోమన్ మరియు బెయిలీ
- By Praveen Aluthuru Published Date - 04:45 PM, Wed - 10 May 23

The Elephant Whisperers: 95వ అకాడమీ అవార్డ్స్‌లో “ది ఎలిఫెంట్ విస్పర్స్” ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను గెలుచుకుంది. నిజ జీవితంలో ఏనుగు సంరక్షకులు బోమన్ మరియు బెయిలీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక ఈవెంట్ సందర్భంగా సిఎస్కె కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశారు. ఆయనతో పాటు చిత్ర నిర్మాత కార్తికీ గోన్సాల్వేస్ కూడా ఉన్నారు.
బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు చేరుకోవాలని చూస్తోంది. అదే సమయంలో టోర్నీలో నిలదొక్కుకునేందుకు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఢిల్లీ భావిస్తోంది. అయితే మ్యాచ్‌కు ముందు మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. కార్యక్రమంలో ఏనుగులను సంరక్షించిన బొమన్, బెయిలీలను సిఎస్కె యాజమాన్యం సన్మానించింది. ఈ కార్యక్రమంలోని అందరికి ఏడో నంబర్ జెర్సీని బహుమతిగా ఇచ్చింది.
Tudumm 🎬 Special occasion with very special people 💛🐘#WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/AippVaY6IO
— Chennai Super Kings (@ChennaiIPL) May 10, 2023
సిఎస్కె అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సదరు ఫోటోలను పోస్ట్ చేసింది. MS ధోనితో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, “మా హృదయాలను గెలుచుకున్న జట్టును అభినందిస్తున్నాం” అంటూ పోస్ట్ చేశారు.
Read More: Sudha Murthy: నా భర్తను మొదటిసారి చూసి ఎవరి చిన్నపిల్లవాడు అనుకున్నాను.. సుధామూర్తి కామెంట్స్ వైరల్?