MRO: థియేటర్లని మూసే హక్కు ఎమ్మార్వోకి లేదు – ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే.
- By Hashtag U Published Date - 10:03 AM, Wed - 9 February 22
ఇటీవల గత కొన్ని రోజుల క్రితం ఏపీలో థియేటర్స్ పై రైడ్స్ నిర్వహించి కొన్ని థియేటర్స్ మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వం మాత్రం సరైన వసతులు లేవని, రిజిస్ట్రేషన్ గడువు అయిపొయింది అని క్లోజ్ చేశామంటూ కారణాలు తెలిపింది. ఆ తర్వాత వసతులు మెరుగు పరిచి, రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేసుకుంటే తెరుచుకోవచ్చు అని కూడా తెలిపింది. అయితే శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని ఓ థియేటర్ ను కూడా ఇలాగే క్లోజ్ చేశారు.
తన థియేటర్ ని MRO క్లోజ్ చేయించాడని థియేటర్ ఓనర్ ఏపీ హైకోర్టుని ఆశ్రయించాడు. టెక్కలి సబ్ కలెక్టర్ ఆదేశాలతోనే థియేటర్ సీజ్ చేశామని ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. థియేటర్ ఓనర్ మాత్రం MRO నే క్లోజ్ చేశారంటూ సాక్షాలు చూపెట్టాడు. దీంతో ఏపీ ప్రభుత్వ న్యాయవాది వాదనని కోర్టు తప్పుబట్టింది. థియేటర్ ను ఎమ్మార్వో సీజ్ చేసే అధికారాలు లేవని అది సబ్ కలెక్టర్ పరిధిలోని అంశమని స్పష్టం చేస్తూ మూసిన థియేటర్ ను తక్షణమే తెరిపించాలని ఆదేశాలు జారీ చేస్తూ తీర్పునిచ్చింది.
Related News
AP Officers In Dilemma : నాడు వైఎస్ నేడు జగన్ ! బ్యూరోక్రాట్స్ లో దడ!!
AP Officers In Dilemma : చంద్రబాబు జైలు పాలయ్యేలా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయగలిగారు. అందుకు ఏపీ సీఐడీ సంపూర్ణ సహకారం అందించింది.