BRS MP: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు
- By Balu J Published Date - 07:04 PM, Sun - 23 June 24

BRS MP: రాజ్యసభలో బి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను , పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావు ను నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బి ఆర్ ఎస్ అధ్యక్షులు కె.చంద్ర శేఖర రావు లేఖ రాసారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే.
బీసీ వర్గానికి చెందిన ఎంపీ రవిచంద్రను పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా నియమించడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు,బీసీలతో పాటు అన్ని వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పారు, కృతజ్ఞతలు తెలిపారు. అయితే రాజ్యసభలో బీఆర్ఎస్ ప్రభావం ఉన్నప్పటికీ.. పార్లమెంట్ లో మాత్రం ప్రాధాన్యం లేకపోవడం గమనార్హం.