Home Minister b’day: ఒకరోజు ముందుగా హోంమంత్రి పుట్టిన రోజు జరిపిన చిత్ర బృందం….
రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజును చిత్ర బృందం ఒకరోజు ముందుగా మంగళవారం నాడు ప్రసాద్ లాబ్స్ లో జరిపింది.
- By Hashtag U Published Date - 11:28 PM, Tue - 1 March 22

రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ పుట్టినరోజును చిత్ర బృందం ఒకరోజు ముందుగా మంగళవారం నాడు ప్రసాద్ లాబ్స్ లో జరిపింది. మార్చి రెండో తేదీన హోం మంత్రి పుట్టినరోజు కావడంతో మంగళవారం నాడు “సదా నన్ను నడిపే” చిత్రం టీజర్ విడుదల సందర్భంగా హోంమంత్రి పుట్టినరోజు ఆ చిత్ర బృందం నిర్వహించింది.
టీజర్ విడుదల కార్యక్రమంలో భాగంగా కేకులు కట్ చేసి హోం మంత్రికి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సదా నన్ను నడిపే చిత్రనిర్మాత కరుణాకర్ దాస్ ,హీరో ప్రతీక్, హీరోయిన్ వైష్ణవి, డీసీఎంఎస్ చైర్మన్ శివ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్రం విజయవంతం చేయాలని హోంమంత్రి కోరారు. కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూసే చిత్రాలను నిర్మిస్తూ ప్రేక్షకులకు చక్కటి సందేశాన్ని ఇచ్చే సినిమాలు రావాలని హోంమంత్రి ఆకాంక్షించారు.