Crime : రేప్ కేసు వెనక్కి తీసుకునేందుకు 50 లక్షలడిగిన తల్లీకూతుళ్ల అరెస్ట్
- By Hashtag U Published Date - 07:30 AM, Fri - 24 June 22

తనపై యువకుడు అత్యాచారం చేశాడంటూ ఒక బాలిక గురుగ్రామ్ లోని పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేసింది. అంతటితో ఊరుకోలేదు. ఈ ఫిర్యాదును వెనక్కి తీసుకునేందుకు యువకుడిని రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు రూ.30 లక్షలు ఇచ్చేందుకు బాధిత యువకుడి సోదరుడు అంగీకరించాడు. అయితే ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం గురించి పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత..బాలిక తల్లికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు.మిగితా డబ్బులు తీసుకునేందుకు ఒక చోటుకు బాలిక తల్లిని పిలిచారు. ఆ డబ్బులు కూడా తీసుకో బోతుండగా పోలీసులు ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డబ్బుల కోసమే సదరు యువకుడిపై అత్యాచారం కేసు పెట్టారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో తల్లీ కూతుళ్ళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 384, 120బీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Related News

Hyderabad Gang Rape : గ్యాంగ్ రేప్ కేసు.. రేప్ తర్వాత పబ్ బేస్మెంట్లో బాలికను మళ్లీ వేధించిన నిందితులు!
రాష్ట్రంలో సంచలనం రేపిన జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు విషయం పట్ల సద్దుమణిగేలా కనిపించడం లేదు.