Earthquake: రెండు సార్లు భూకంపానికి గురైనా.. బతికి బట్టకట్టిన తల్లిబిడ్డ!
తుర్కియే, సిరియాలను భూకంపం అతలాకుతులం చేసింది. వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు ప్రాంతాల్లో..
- By Anshu Published Date - 08:03 PM, Tue - 14 February 23

Earthquake: తుర్కియే, సిరియాలను భూకంపం అతలాకుతులం చేసింది. వేల మంది ప్రాణాలను బలి తీసుకుంది. రెండు ప్రాంతాల్లో.. ఎక్కడ చూసిన శవాల గుట్టలే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. ఆ ప్రళయాన్ని తలచుకుంటేనే అక్కడి ప్రజలు భయభ్రాంతాలకు గురవుతున్నారు. ఇప్పటికీ ఈ రెండు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అదృష్టవశాత్తు కొందరు ప్రాణాలతో బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ తల్లి, ఆమె శిశువు మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు ప్రాణాలతో బయటపడ్డం విశేషం.
సిరియాలోని జిందిరెస్ ప్రాంతానికి చెందిన దిమా ఏడు నెలల గర్భిణి. ఫిబ్రవరి 6న భూకంపం సంభవించిన సమయంలో… ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఆ సమయంలో భూ ప్రకంపకలు ఒక్కసారి వచ్చేశాయి. ఈ ధాటికి ఇళ్లు పాక్షింకంగా దెబ్బతింది. గోడలు కూలి ఆమె గాయాలపాలై, అమెరికన్ మెడికల్ సొసైటీ సహకారంతో ఆమెను అఫ్రిన్‌లోని ఆసుపత్రికి తరించారు. అక్కడ ఆమె మగశిశువుకు జన్మనించింది.
అయితే దిమాకు మరోచోట తలదాచుకునేందుకు వీలులేక.. తన శిశువుతో కలిసి మళ్లీ అదే ఇంటికి తిరిగి వెళ్లింది. భూకంపం ధాటికి అప్పుడే బలహీనంగా మారింది. దీంతో మూడు రోజులకు మరోసారి పూర్తిగా ఇళ్లు కూలిపోయింది. దీంతో శిథిలాల్లో చిక్కుకుపోయిన తల్లీబిడ్డను మరో సారి రక్షించారు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి…. ఓ టెంట్ కింద ఉన్నట్లు తెలిసింది.
భూకంపం ధాటికి చితికిపోయిన ప్రాణాలు ఇప్పటికే భవన శిథిలాల కిందనే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ దేశాల నుంచి వెళ్లిన రెస్క్యూ టీమ్స్ అవిశ్రాంతంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికి 25 వేల మంది చనిపోయినట్లు చెబుతున్నా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని నిపుణులు అంటున్నారు.