Pune Shocker: దారుణం: భర్త ఎదురుగానే భార్యను అత్యాచారం
మహారాష్ట్రలోని పూణెలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. పూణెలో రుణం చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- Author : Praveen Aluthuru
Date : 27-07-2023 - 1:14 IST
Published By : Hashtagu Telugu Desk
Pune Shocker: మహారాష్ట్రలోని పూణెలో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. పూణెలో రుణం చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పూణె(Pune)లో ఒక మహిళపై 47 ఏళ్ల వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఘటన జరిగిందని, ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు హడప్సర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి భర్త అప్పు చేసి తిరిగి చెల్లించలేకపోయాడు. నిందితులు బాధితురాలి భర్తను కత్తితో బెదిరించి, అతని సమక్షంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు ఈ దారుణమైన చర్యను మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశాడు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. నిందితుడిపై ఇండియన్ పీనల్ కోడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: Revanth Reddy: జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: రేవంత్ వార్నింగ్