HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Speed News
  • >Mohanbabu Attempted Murder Case Media Assault Allegations

Mohanbabu : మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు..!

Mohan Babu : ప్రముఖ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మీడియా ప్రతినిధులపై దాడి ఆరోపణల నేపథ్యంలో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదైంది.

  • By Kavya Krishna Published Date - 11:41 AM, Thu - 12 December 24
  • daily-hunt
Mohan Babu
Mohan Babu

Mohanbabu : పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ నటుడు మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. మీడియా ప్రతినిధులపై దాడి ఆరోపణల నేపథ్యంలో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109 కింద ఈ కేసు నమోదైంది. పోలీస్ వారు తీసుకున్న న్యాయ సలహా ఆధారంగా ఈ చర్య తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ఈ ఘటనపై సెక్షన్ 118(1) BNS కింద కేసు నమోదు చేయడం జరిగింది. మంగళవారం రాత్రి మంచు కుటుంబంలో జరుగుతున్న కుటుంబ విభేదాల నేపథ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జల్పల్లి ప్రాంతంలో మోహన్ బాబు నివాసం వద్ద మీడియా ప్రతినిధులు సంఘటనను కవర్‌ చేయడానికి చేరుకున్నారు. ఈ సమయంలో, నటుడు మంచు మనోజ్ తలుపులు తోసుకొని లోపలికి వెళ్తుండగా, మీడియా ప్రతినిధులు అతడిని అనుసరించి లోపలికి ప్రవేశించారు.

Judge Vs India Bloc : ‘‘హిందుస్తాన్’’ వ్యాఖ్యలు.. హైకోర్టు జడ్జిపై ‘ఇండియా’ కూటమి అభిశంసన తీర్మానం

ఈ సమయంలో, మోహన్ బాబు ఇంటి నుండి బయటకు వచ్చి, ఒక జర్నలిస్ట్ చేతిలో ఉన్న మైక్‌ను బలవంతంగా లాగడం, ఆ మైక్‌తోనే అతడిని దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో జర్నలిస్ట్‌కు తీవ్రమైన గాయాలు అయ్యాయి. అదనంగా, అక్కడ ఉన్న బౌన్సర్లు ఇతర మీడియా ప్రతినిధులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించి పలువురిపై దాడి చేశారు. ఈ ఘటనలన్నింటి ఆధారంగా పోలీస్ వారు ఈ కేసును నమోదు చేశారు. అయితే.. ఈ ఘటన అనంతరం అనూహ్యంగా మోహన్‌బాబు హైబీపీతో ఆనారోగ్యానికి గురయ్యారని, కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మంచు విష్ణు వెల్లడించారు.

అయితే.. నిన్న ఉదయం రాచకొండ సీపీ ముందు మంచు బ్రదర్స్‌ వేరు వేరుగా హాజరయ్యారు. ఘర్షణ వాతావరణం క్రియేట్‌ చేయవద్దని.. ఒక వేళ ఏమైనా గొడవ జరిగిన మీదే బాధ్యతంటూ ఇద్దరి వద్ద నుంచి రూ.లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు బాండ్లు తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే.. ఈ రోజు మోహన్‌ బాబు మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. ఇప్పటికే మీడియాపై దాడికి జర్నలిస్టులు నిరసన తెలిపారు. మోహన్‌ బాబు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Yuvraj Singh Birthday : రికార్డుల రారాజు యువ‘రాజ్’‌కు హ్యాపీ బర్త్‌డే.. కెరీర్ విశేషాలివీ


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Attempted Murder Case
  • Celebrity Legal Issues.
  • controversy
  • hyderabad news
  • Journalist Attack
  • Manchu Family Dispute
  • manchu manoj
  • Media Assault
  • mohan babu
  • Pahadi Shareef Police

Related News

Controversy in AP Endowment Department.. The stage is set for the dismissal of the Assistant Commissioner!

AP : దేవాదాయ శాఖలో వివాదం..అసిస్టెంట్ కమిషనర్ పై వేటుకు రంగం సిద్ధం!

గత నెల 16న దేవాదాయ శాఖ కమిషనర్ కె. శాంతికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుకు ఆమె ఇటీవలే సమాధానమిచ్చారు. అయితే, ఆమె సమర్పించిన వివరణలు శాఖను తృప్తిపరచలేకపోయాయని సమాచారం.

  • Kannappa

    Kannappa : ఓటీటీలోకి వచ్చిన మంచు విష్ణు ‘కన్నప్ప’..

  • Telangana Secretariat

    Telangana Secretariat : కొత్త టెండర్ల పిలుపు.. 200 మంది భవితవ్యం ప్రశ్నార్థకం..?

Latest News

  • Modi Govt : న్యాయ వ్యవస్థలో విప్లవం..’రోబో జడ్జిలు’ సరికొత్త ప్రయోగం..

  • Narendra Modi : ట్రంప్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ స్పందన

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd