Modi Surname Case : గుజరాత్ ప్రభుత్వం, ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీకి సుప్రీంకోర్టు నోటీసులు.. “మోడీ ఇంటిపేరు”పై రాహుల్ వ్యాఖ్యల కేసు
Modi Surname Case : “మోడీ ఇంటిపేరు”పై వ్యాఖ్య కేసులో గుజరాత్ హైకోర్టు తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది.
- By Pasha Published Date - 01:12 PM, Fri - 21 July 23

Modi Surname Case : “మోడీ ఇంటిపేరు”పై వ్యాఖ్య కేసులో గుజరాత్ హైకోర్టు తనకు విధించిన శిక్షపై స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ పిటిషన్ పై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన కోరింది. దీనిపై అభిప్రాయం చెప్పాలంటూ వారికి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. “కేసు ప్రస్తుతం ఉన్న దశలో మిగిలిన ప్రశ్న ఏమిటంటే.. నేరారోపణపై స్టే విధించే అర్హత ఉందా” అని బెంచ్ వ్యాఖ్యానించింది.
Also read : AP Volunteer : వాలంటీర్లు సేకరిస్తున్న డేటాపై ప్రజల్లో మొదలైన వ్యతిరేకత..
స్టే ఇవ్వకపోతే స్వేచ్ఛకు ఆటంకం
రాహుల్ గాంధీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. “రాహుల్ గాంధీకి విధించిన శిక్షపై స్టే విధించేందుకు నిరాకరిస్తూ జులై 7న గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై .. కనీసం సుప్రీం కోర్టు అయినా స్టే విధించాలి. లేదంటే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ, ఆలోచన, అభిప్రాయ ప్రకటనలకు ఆటంకం కలుగుతుంది” అని పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ 111 రోజుల పాటు బాధపడ్డారు. ఆయన ఒక పార్లమెంటు సమావేశానికి దూరమయ్యారు. ఇప్పుడు మరో సెషన్‌ను కూడా కోల్పోబోతున్నారు” అని అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు వివరించారు. ఈ వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం తదుపరి విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది.
Also read : Jacquline : డెనిమ్ జీన్స్ బ్లాక్ బ్రా తో జాక్యాలిన్ హాట్ షో
2019 ఏప్రిల్ 13న..
అంతకుముందు రాహుల్ గాంధీ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ అత్యవసర విచారణను కోరడంతో.. దాన్ని విచారించేందుకు సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం జూలై 18న అంగీకరించింది. ఈక్రమంలోనే ఇవాళ ఆ పిటిషన్ పై విచారణ జరిపింది. 2019 ఏప్రిల్ 13న కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ఎన్నికల సభలో.. “దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరే ఎందుకు ఉందో” అని రాహుల్ గాంధీ వివాదాస్పద కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ.. రాహుల్ గాంధీపై క్రిమినల్ పరువు నష్టం కేసు వేశారు.